మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు,
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్ధతపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ధనలాభం ఉంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. జూదాలు బెట్టింగులకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోభీష్టం నెరవేరుతుంది. వాక్చాతుర్యంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ప్రయాణం తలపెడతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సముచిత నిర్ణయం తీసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య నుంచి విముక్తులవుతారు. గృహంత ప్రశాంతంగా ఉంటుంది. గుట్టుగా మెలగండి. మీ యత్నాలకు కొందరు అవరోధం కలిగిస్తారు. పనులు పురమాయించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి తక్షణమే ఫలిస్తుంది. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వాహనం, విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు చురుకుగా సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతితో స్వల్ప కలహం. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు.