Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-03-2024 ఆదివారం దినఫలాలు - మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు...

రామన్
ఆదివారం, 17 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ అష్టమి రా.2.23 మృగశిర రా.9.16 తె.వ.5.52 ల సా.దు. 4.29 ల 5.16.
 
మేషం :- ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
వృషభం :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కుంటారు. గృహోపకరణాలను అమర్చుకుంటారు. విద్యార్ధులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. ఆత్మీయుల కలయికతో స్త్రీలు మానసికంగా కుదుటపడతారు.
 
మిథునం :- భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. లాయర్లకు, ఆడిటర్లకు, డాక్టర్లకు ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. వదంతులు నమ్మటం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు.
 
సింహం :- ఆర్థిక కుటుంబ విషయాలపట్ల దృష్టి సాగిస్తారు. విదేశీ వస్తువులు సేకరిస్తారు. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, పానియ వ్యాపారులకు కలిసివస్తుంది.
 
కన్య :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి. స్త్రీలకు షాపింగులోను, వస్తు నాణ్యత ఎంపికలోను ఏకాగ్రత అవసరం. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
తుల :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు.
 
వృశ్చికం :- దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంక్ వ్యవహారాలలో మెళకువ అవసరం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల వ్యవహరాల్లో పునరాలోచన అవసరం. మీ కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
 
ధనస్సు :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి ఆశాజనకం. వ్యవహార దక్షతతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు.
 
మకరం :- నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులుతప్పవు. దంపతుల సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించటం మంచిది. రుణాలు స్వీకరిస్తారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి లాభదాయకం. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. చేపట్టిన పనులలో స్త్రీలు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కుంటారు. బంధువర్గాల నుండి వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కుంటారు. 
 
మీనం :- బంధువుల రాకపోకలవల్ల ఖర్చులు అధికమవుతాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ధనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chaganti : చాగంటి పర్యటనలో ఎటువంటి అగౌరవం జరగలేదు-టీటీడీ

13 Kilometers in 13 Minutes: గుండె మార్పిడిలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర

తెలంగాణలో టీడీపీ పునరుద్ధరణపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా అవకాశం పేరుతో మహిళపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్

NTR: ఎన్టీఆర్ 29వ వర్ధంతి.. నివాళులు అర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kanuma: సంక్రాంతి సంబరం..కనుమ విశిష్టత.. రైతన్న నేస్తాలు పశువులకు పండగ

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

14-01-2025 మంగళవారం దినఫలితాలు : శ్రమతో కూడిన ఫలితాలున్నాయి...

మకర సంక్రాంతి- 12 రాశులు చేయాల్సిన దానాలు.. గంగమ్మ భువిపైకి?

తర్వాతి కథనం
Show comments