Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-12-2023 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర శు॥ తదియ రా.12.56 పూర్వాషాఢ ఉ.10.41 సా.వ.6.18 ల 7.49. ఉ.దు. 8. 29 ల 9.13 పు. దు. 12.10 ల 12.54.
లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత మెళకువ వహించండి. భాగస్వామిక చర్చల్లో కొంతపురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వాహనచోదకులకు స్వల్ప ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
వృషభం :- ఆర్థికలావాదేవీలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. వ్యవసాయ, తోటల రంగాలవారికి ఫలసాయం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రింటింగ్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ శక్తిసామర్ధ్యాల మీదఎదుటివారికి విశ్వాసం ఏర్పడుతుంది. భాగస్వామికులు మీ శక్తిసామర్ధ్యాలను గుర్తిస్తారు.
 
మిథునం :- ఉద్యోగస్తులు మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. తరుచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహరాల్లోనూ, స్కీంల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. మీ అతిథి మర్యాదలు బంధు మిత్రులను ఆకట్టుకుంటాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. 
 
సింహం :- లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య :- కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆర్యోగంలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు కోరుకున్న చోటికి బదిలీలు అనుకూలిస్తాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.
 
తుల :- బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురౌతారు. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
వృశ్చికం :- బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
ధనస్సు :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెళకువ వహించండి. ఇంటా బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో త్వరలోనే లభిస్తుంది. రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments