Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-12-2023 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Advertiesment
Weekly astrology
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (04:00 IST)
మేషం :- మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది.
 
వృషభం :- రాజకీయలలోనివారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. బంధు మిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. కోర్టు వ్యవహరాలు వాయిదా కోరుకోవటంమంచిది.
 
మిథునం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. శ్రమాధిక్యత, వాతావరణలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. కూర, పండ్ల, కొబ్బరి, ధాన్య స్టాకిస్టులకు కలిసివచ్చేకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
కర్కాటకం :- దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. అర్థాంతరంగా నిలిపి వేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం.
 
సింహం :- ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్లైములు మంజూరవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి.
 
కన్య :- ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచన లుంటాయి.
 
తుల :- మీ కుటింబీకులతో ఏకీభించలేకపోతారు. ఏకాగ్రత లోపించటం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది.
 
వృశ్చికం :- మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధానపరుస్తారు. దుబారా ఖర్చులు అధికం. దైవ సేవా కార్యాక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ అంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో ధనంఅధికంగా వ్యయంగా చేస్తారు.
 
మకరం :- స్త్రీలకు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయనాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. మీ పనులు, కార్యక్రమాలుమందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు.
 
మీనం :- మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. గృహ నిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 13న పోలి పాడ్యమి.. బియ్యపు పిండితో దీపాలను..?