Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-08-2024 బుధవారం దినఫలాలు - నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం...

రామన్
బుధవారం, 14 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు॥ దశమి పూర్తి అనూరాధ ఉ.8.58 ప.వ.2.47 ల 4.27. 3.5.11.40 12.31.
 
మేషం :- స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళుకువ అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి తలెత్తుతాయి. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు. 
 
వృషభం :- ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి వుండజాలదు. వివాహ యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. వ్యాపారాలు అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి.
 
మిథునం :- బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడం కష్టం. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. విద్యార్థులకు మిత్ర బృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలు వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
సింహం :- ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత లుంటాయి.
 
కన్య :- బంధు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెవవేరుతాయి. గృహములో మార్పులు చేర్పులు ఆకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు.
 
తుల :- మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబీకుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు వస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మీ సంతానం విద్యా వివాహాలకు ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురువుతారు.
 
వృశ్చికం :- ఆర్ధిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశముంది.
 
ధనస్సు :- బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల చికాకులు, అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. మీరు చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్ చాతుర్యం ఉండును. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
మకరం :- ఆర్థికంగా పురోగమించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఓర్పు, దీక్షతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. స్త్రీలు పనివారితో ఇబ్బందులనుఎదుర్కుంటారు.
 
మీనం :- సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. తలపెట్టిన పనులు ద్విగ్విజయంగా పూర్తి చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

తర్వాతి కథనం
Show comments