Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

రామన్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (04:00 IST)
Today Daily Astro మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు విపరీతం. ఆలయాలు సందరిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒప్పందాలకు అనుకూలం. ప్రముఖుల సలహా పాటిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. లావాదేవీల్లో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక వ్యవహారాల్లో నిపుణుల సలహా తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు హడావుడిగా సాగుతాయి. సోదరులతో విభేదిస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. విదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆప్తులతో సంభాషిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలుచుకున్న గుకేశ్ దొమ్మరాజు

వార్తాపత్రికల్లో చుట్టబడిన వేడి వేడి సమోసాలు, జిలేబీలు లాగిస్తున్నారా?

ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

తిరుమలలో కుంభవృష్టి.. ఏరులై పారుతున్న వర్షపునీరు (Video)

ఏపీలో టెన్త్ - ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..?

అన్నీ చూడండి

లేటెస్ట్

Virgo Prediction 2025 : కన్యారాశికి 2025వ సంవత్సరం ఎలా వుంటుంది?

Leo Zodiac Sign Horoscope: సింహ రాశి 2025 ఫలితాలు.. శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే?

Today Daily Astro బుధవారం రాశిఫలాలు - దంపతుల మధ్య సఖ్యత...

Cancer Zodiac Sign: కర్కాటక రాశి 2025 వార్షిక ఫలితాలు : ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే?

Gemini Horoscope 2025: మిథున రాశి 2025 రాశి ఫలాలు: సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేస్తే..?

తర్వాతి కథనం
Show comments