Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-10-2023 గురువారం రాశిఫలాలు - ఈశ్వరునికి తైలాభిషేకం చేయించి...

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| చతుర్ధశి రా.9.01 ఉత్తర ప.2.36 రా.వ.11.43 ల 1.27. ఉ. దు. 8.16 ల 9.03 వ. దు. 12.12 ల 1.00.
 
ఈశ్వరునికి తైలాభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- పత్రికా, మీడియారంగాల వారికి చికాకులు అధికం. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైన ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉపాధిపథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానం అందుతాయి.
 
వృషభం :- ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధాల రావచ్చు. విద్యార్ధులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
మిథునం :- బంధు మిత్రులతో పట్టింపులెదుర్కొంటారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. హోటల్, కేటరింగ్ పనివారలకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశతప్పదు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
 
సింహం :- మీ సంతానం విద్యావిషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. ప్రముఖులను, ఆత్మీయులను కలుసుకుంటారు.
 
కన్య :- స్టాక్ మార్కెట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీకు కావలసిన వస్తువు లేక పత్రాలు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
తుల :- బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. అందరితో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం :- దూరప్రయాణాలలో ఏకాగ్రత చాలా అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆరోగ్యం ఆంధోళన కలిగిస్తుంది. రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. మీరంటే పడని వ్యక్తులు మీ వ్యాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకుంటారు.
 
ధనస్సు :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు, దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
మకరం :- ఒక వ్యవహారం నిమిత్తం ప్రముఖులను కలుసుకుంటారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంలో స్వల్ప చికాకులుంటాయి. రావలసిన ధనం అందకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులు కొత్తబాధ్యతలు చేపడతారు.
 
కుంభం :- విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. సన్నిహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మీనం :- మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కష్టసమయంలో సన్నిహితులకుఅండగా నిలుస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

గురువారం అక్టోబర్ 31న తిరుమల విఐపి దర్శనం రద్దు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments