Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-09-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే సర్వదా శుభం...

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికం అయినా సంతృప్తి ప్రయోజనం పొందుతారు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహరాలకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
వృషభం :- కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు సాహస కార్యాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది.
 
మిథునం :- ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కంది, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, ఆవాలు స్టాకిస్టులకు, వ్యాపారులకు కలిసిరాగలదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
కర్కాటకం :- ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవటం వల్ల ఆందోళనకు గురువుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు.
 
సింహం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. చిరు పరిచయాలు మరింతగా బలపడతాయి. ఉన్నతాధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండటం క్షేమదాయకం. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలలో భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
కన్య :- స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులౌతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలేర్పడతాయి. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ధనం ముందుగానే సిద్ధం చేసుకోవటానికి యత్నించండి. స్వతంత్ర వృత్తులలో వారికి జయం చేకూరును.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విదార్దులు చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు. నగదు చెల్లింపు చెక్కుల జారి విషయంలో జాగ్రత్త వహించండి.
 
మకరం :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ సన్నిహితుల వైఖరివల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం.
 
కుంభం :- ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. రవాణా రంగాలవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. రావలసిన ధనం వసూలు విషయంలో ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు.
 
మీనం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నూనె, మిర్చి, కంది స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు ఆశాజనకం. దైవ సేవా కార్య క్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

2025: వృశ్చిక రాశి కుటుంబ జీవితం ఎలా వుంటుంది? ఆకుపచ్చ మొక్కలను?

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

తర్వాతి కథనం
Show comments