Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-03-2025 గురువారం రాశిఫలాలు - ఇంటిని నిర్లక్ష్యం చేయకండి...

రామన్
గురువారం, 13 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. వేడుకలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పత్రాల రెన్యుల్‌‍లో ఏకాగ్రత వహించండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. పొగిడేవారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కీలక సమావేశంలో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్వయం సిద్ధికి మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు. పొదుపు ధనం అందుకుంటారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. పనులు చురుకుగా సాగుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. యత్నాలకు ఆప్తులు సహకరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు సామాన్యం. పనుల్లో శ్రమ ఒత్తిడి అధికం. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతులు ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

09-03-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

09-03-25 నుంచి 15-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

08-03-2025 శనివారం దినఫలితాలు - ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి...

హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం- ఈ రాశులు వారు జాగ్రత్తగా వుండాలి..

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

తర్వాతి కథనం
Show comments