Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-12-2022 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- కోరుకున్న వ్యక్తులు తారసపడతారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చాకచక్యంగా ఎదుర్కుంటారు. ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రతచాలా అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. 
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. వాహనచోదకులకు మరమ్మతులు, జరిమానా వంటి చికాకులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మిథునం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. పనివారలను అతిగా విశ్వసించటం మంచిదికాదు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. 
 
కర్కాటకం :- ఆర్థిక, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం.
 
సింహం :- ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో చికాకులు, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి.
 
కన్య :- ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో బాగుగా రాణిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. బంధువులను కలుసుకుంటారు.
 
తుల :- ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురౌతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది.
 
వృశ్చికం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి.
 
ధనస్సు :- ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ఒకానొక వ్యవహరాంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. నిర్మాణ పథకాల్లో పనివారితోలౌక్యం అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రతి విషయానికీ ఇతరులపై ఆధారపడే మీ ధోరణి మార్చుకోవడం శ్రేయస్కరం. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అనుకోని ఖర్చులవల్ల ఇబ్బందు లెదుర్కుంటారు.
 
కుంభం :- విద్యార్ధులు, క్రీడ, క్విజ్ వంటి పోటీల్లో రాణిస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓర్పు, శాంతయుతంగా వ్యవహరించటం వల్ల ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, సమస్యలు అధికమవుతాయి. వాహన చోదకులకు చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. 
 
మీనం :- భాగస్వాముల సమన్వయం లోపించటంతో విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. అయినవారి కోసం ధనంబాగా వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలుమీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments