Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-08-2024 సోమవారం దినఫలాలు - విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు...

రామన్
సోమవారం, 12 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు|| సప్తమి తె.3.26 స్వాతి తె.5.33 ఉ.వ.9.24 ల 11.09. సా.దు. 4.46 ల 5.37.
 
మేషం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. తలపెట్టినపనుల్లో ఆర్థకాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. రావలసిన మొండిబాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.
 
వృషభం :- మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. ప్రేమ వ్యవహారాలోను, దూరప్రయాణాల్లో మెళుకువ వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానంతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి.
 
మిథునం :- విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబీకుల కోసం నూతన పధకాలు వేస్తారు. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
కర్కాటకం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
సింహం :- మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రముఖులతో సభా సమావేశాలలో పాల్గొంటారు.
 
కన్య :- మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారలతో చికాకులు తప్పవు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు.
 
తుల :- ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికైచేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి.
 
వృశ్చికం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. బంధు మిత్రులరాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. గత అనుభవాలుజ్ఞప్తికి రాగలవు.
 
ధనస్సు :- శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. కోళ్ళ, గొర్రె, పాడి పరిశ్రమ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
మకరం :- బృంద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రకటనలు, ప్రచురణలకు ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థులు వాహనం నడుపునపడు మెళుకువ అవసరం. విద్యార్థులు క్రీడలు, ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు.
 
కుంభం :- ఆర్థికంగా బలం చేకూరుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారముంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మీనం :- మీ ప్రత్యర్థుల తీరు మీకు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

తర్వాతి కథనం
Show comments