Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-03-2023 నాటి మీ రాశి ఫలితాలు.. ఏ రాశుల వారికి లాభం?

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (05:00 IST)
ఆదివారం సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది.
 
మేషం: – వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. విదేశీయానం, రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తొలగి పోతాయి. 
 
వృషభం : :- మీ జీవితభాగస్వామితో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వూలలో జయం పొందుతారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
మిథునం:- విద్యార్థులు తొందరపాటు తనం వదిలి ఏకాగ్రతతో చదివిన సత్ఫలితాలను పొందగలరు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు బదిలీ వార్త ఆందోళన కలిగిస్తుంది. సేవా సంస్థల్లో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
కర్కాటకం:- ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకోగల్గుతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీలకు ఆర్జనపట్ల, విలాస వస్తువులపట్ల ఆసక్తి, పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. గృహ నిర్మాణాలలో వ్యయం మీ అంచనాలను మించుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య:- చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. రిప్రజెంటివులు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పానియ, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల:- మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. క్రయ విక్రయాలు వాయిదా పడుట మంచిది. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.
 
వృశ్చికం:- పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం అధికమవుతుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
ధనస్సు:- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. 
 
మకరం:- రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. అనురాగ వాత్సల్యాలు పెంపొందగలవు. విద్యార్ధినులు కొత్త విషయాల పట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనబరుస్తారు. ఆడిట్, అక్కౌంట్సరంగాల వారికిఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
కుంభం:- విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
మీనం:- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలించవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చల విడిగా వ్యయం చేస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments