Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

09-03-2023 గురువారం మీ రాశి ఫలితాలు... దత్తాత్రేయుడిని ఆరాధిస్తే?

Dattatreya Jayanti
, గురువారం, 9 మార్చి 2023 (05:00 IST)
దత్తాత్రేయుడిని ఆరాధించి మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం:- ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
వృషభం :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆస్తి పంపకాలు, కోర్టు వ్యవహరాలు పరిష్కారమవుతాయి. విదేశాల్లోని వారికి వస్తు సామగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. దైవ, శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిథునం:- మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఏ విషయంలోను ఆసక్తి పెద్దగా ఉండదు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూవస్తునన్న పనులు పూర్తవుతాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. 
 
కర్కాటకం:- ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృత్తి వ్యాపారులకు మిశ్రమ ఫలితంగా ఉంటుంది. విందు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
సింహం: - కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కన్య: - ముఖ్య విషయాల్లో కుటుంబీకుల సలహాను పాటించడం మంచిది. బ్యాంకు వ్యవహరాల్లో మెలకువ వహించండి. ఆస్తి వ్యవహరాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్ఫలితాలనిస్తుంది. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల:- విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. పత్రిక సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
వృశ్చికం:- సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. కళ రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో కీలకపాత్రవహిస్తారు. కాంట్రాక్టరకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది.
 
ధనస్సు:- మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. తోటల రంగాల వారికి దళారీలనుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధువుల రాక అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మకరం:- గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు.
 
కుంభం:- ప్రింటింగ్ రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థినులలో భయాందోళనలు అధికమవుతాయి. ఏమరుపాటుగా వహనం నడపటం వల్ల ఊహించని చికాకులు తలెత్తుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాల పట్ల దృష్టి సారిస్తారు. రుణ యత్నాలు ఏమాత్రం ముందుకు సాగవు.
 
మీనం:- నిరుద్యోగులు,వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు వస్త్రప్రాప్తి, ఆహ్వానాలు, విందులు వంటి శుభపరిణా మాలున్నాయి. ఖర్చులు అధికం, రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-03-2023 తేదీ బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా..