Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేదీ 06-03-2023 శనివారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం...

Advertiesment
astro1
, సోమవారం, 6 మార్చి 2023 (04:04 IST)
మేషం :- ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా మెలిగి అధికారులను ఆకట్టుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. స్త్రీలు షాపింగులోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సర్టిఫికెట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయి.
 
వృషభం :- కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీల గడువు పెంపునకు అనుకూలం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం అని గ్రహించండి. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారు ఆభరణాలకు వ్యాపారులకు కలిసివచ్చే కాలం. నూతన వివాహితులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
మిథునం :- వృత్తి వ్యాపారపరంగా ప్రముఖులతో పరిచయాలు, ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. సేవాసంస్థల్లో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో చక్కని అనుభవం గడిస్తారు. గృహనిర్మాణ ప్లానుకు ఆమోదం లభిస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి పురోభివృద్ధి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. 
 
కర్కాటకం :- పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. స్త్రీలపై బంధువులు, పొరుగువారి ప్రభావం అధికం. మీ సమస్యలు, ఇబ్బందులు త్వరలో పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. చేతకాని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటంమంచిది.
 
సింహం :- ఎదుటివారిలో తప్పులను వెదికే ప్రయత్నాలను విరమించండి. పాత సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. సోదరీ సోదరులతో అవగాహనకు రాగల్గుతారు. ఒకోసారి మీ అతిసంభాషణ వల్ల బంధు మిత్రులకు దూరం అవ్వవచ్చు. కొంతమంది వ్యాపారాల్లో మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు జాగ్రత్త వహించండి.
 
కన్య :- ఆదాయ వ్యయాల్లో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వస్తువులపట్ల ఆపేక్ష అధికం అవుతుంది. విద్యార్థుల్లో అతి ఉత్సాహం అధికం అవుతుంది. చదువుల్లో బాగుగా ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులు, అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానవస్తుంది.
 
తుల :- ప్రైవేటు రంగాల్లో వారు అధికారులను తక్కువ అంచనా వేసి మాట్లాడటం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వస్తువులపట్ల, వస్త్రాల పట్ల, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబీకుల వైఖరి మీ కెంతో ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఎదుటివారి ఆలోచనలను గ్రహించి ఎత్తుకు పై ఎత్తు వేయటం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రకృతి, వైద్య, ఆయుర్వేద రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మీడియా రంగాల్లోవారికి పనిభారం అధికం అవుతుంది.
 
ధనస్సు :- భాగస్వామ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ఇంజనీరింగ్, టెక్నికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. నూనె, ఇనుము, కంది, మిర్చి, పత్తి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి.
 
మకరం :- రక్షణ రంగాల్లో వారికి రక్షణ కరువవుతుంది. విద్యుత్ లోపం అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. గ్యాస్ వ్యాపారస్తులకు పనివారితో ఇక్కట్లు తలెత్తగలవు. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు.
 
కుంభం :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. రిప్రజెంటివ్‌కు ప్రోత్సాహంగా ఉండగలదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండవు. ఇతర దేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టండి జయం చేకూరుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-03-2023 తేదీ ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం...