Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-03-2023 తేదీ గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించడం...

Advertiesment
Capricorn
, గురువారం, 2 మార్చి 2023 (04:00 IST)
మేషం :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఒకసారి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు.
 
వృషభం :- స్థిరాస్తి మూలక ఆదాయం అందుకుంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగయత్నంలో స్త్రీలకు ఓర్పు, పట్టుదల ప్రధానం. అయినవారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. పెట్టుబడులు, పొదుపు పథకాల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మిథునం :- పెద్దల ఆరోగ్యం సంతృప్తినిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను పూర్తి చేస్తారు. వ్యాపార, పరిశ్రమ రంగాల వారికి చికాకులు అధికం. అధికారులకు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. 
 
కర్కాటకం :- వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. అయినవారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు తప్పవు.
 
సింహం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు పూర్తికాక అసంతృప్తి చెందుతారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- ఉపాధ్యాయులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలు వస్త్ర, బంగారం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినివ్వగలదు.
 
తుల :- దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళకువ వహించండి. మీ అలవాట్లు, బలహీనతల వల్ల ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. దైవ, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నా ధనానికి కొదవ ఉండదు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
ధనస్సు :- స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలకు సన్నాహాలు చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మకరం :- పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. ఒకానొక సందర్భంలో మీ ఆవేశపూరిత నిర్ణయాలు ఇబ్బందులకు దారి తీస్తాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారస్తులకు ఊహించని సమస్యలు వస్తాయి. దూరపు మిత్రులను కలుసుకుంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు.
 
కుంభం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఏ సమస్యనైనా నిబ్బరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యమైనా ఆశించిన ప్రయోజనాలుండవు.
 
మీనం :- ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. మీ అతిథి మర్యాదలు బంధువులను సంతృప్తిపరుస్తాయి. రుణాలు తీరుస్తారు. స్త్రీలకు పనివారితో సమస్యతలు తలెత్తుతాయి. చెల్లని చెక్కులతో ఇబ్బందులెదుర్కొంటారు. నిర్మాణ పనులలో లోపం వల్ల కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చికాకులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి లడ్డూ ప్రసాద పంపిణీకి నేటి నుంచి పేస్ రికగ్నేషన్ అమలు