Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-10-2023 - బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| ద్వాదశి సా.5.12 మఘ ఉ.9.38 సా.వ.6.29 ల 8.15. ప. దు. 11. 26 ల 12.13.

సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులు తరచూ సభాసమావేశాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
వృషభం :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు చర్చలు జరుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. 
 
మిథునం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుది. వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండటం ఉత్తమం. 
 
కర్కాటకం :- విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది. 
 
సింహం :- ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. విదేశీయాన యత్నాలు చురుకుగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. రావలసిన ధనం వాయిదా పడుతుంది.
 
కన్య :- వృత్తుల్లో వారికి, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు ఏ పనియందు ధ్యాస ఉండదు. పెద్దల ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. రిప్రజెంటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
తుల :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. గృహంలో స్వల్పమార్పులు, మరమ్మతులు చేపడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది.
 
వృశ్చికం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రముఖులతో పరిచయాలు అధికమవుతాయి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. వ్యాపారాల విస్తరణకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మధ్య మధ్య ఔషధ సేవతప్పదు.
 
ధనస్సు :- దైవదర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. రాజకీయనాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రత్తి, పొగాకు, చెరుకు రైతులకు సంతృప్తి కానవస్తుంది.
 
మకరం :- మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
కుంభం :- ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మీనం :- ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది, మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. బంధువుల రాకతో అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

లేటెస్ట్

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

తర్వాతి కథనం
Show comments