Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-03-2024 ఆదివారం దినఫలాలు - మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి

రామన్
ఆదివారం, 10 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ బ॥ అమావాస్య ప.3.34 పూర్వాభాద్ర తె.3.45 ఉ.వ.11.24 ల 12.53. సా.దు. 4.29 ల 5.16.
 
మేషం :- రవాణారంగాల వారికి మెళకువ, ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు, ఆందోళన కలిగిస్తుంది. రాజకీయాలలో వారికి గణణీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
మిథునం :- స్త్రీలకు పనివారితో సమస్యతలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆప్తులకు విలువైన కానుకలు చదివించుకుంటారు.
 
కర్కాటకం :- మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
సింహం :- ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకుఎంతో చికాకుకలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. దుబారా నివారించ లేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య :- ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. స్త్రీలుభేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరిస్తే మంచిది. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల :- రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
వృశ్చికం :- బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లోవారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. 
 
ధనస్సు :- సొంతంగా గృహం ఏర్పచుకోవాలనే కోరిక బలీయమవుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. ఒక కార్యం నిమిత్తం మీరు చేసే పనికి ఇతరులు ఆటంకం కలిగించేందుకు యత్నిస్తారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు.
 
మకరం :- రుణాల కోసం అన్వేషిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో స్థిరపడతారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు బాగా కలిసిరాగలదు.
 
కుంభం :- మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయ గల్గుతారు. ఇతురులు వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.
 
మీనం :- సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు చేసి సమస్యలు తెచ్చుకోకండి. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

మోహన్ బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ వెల్లడి (Video)

జనసేనలోకి మంచు మనోజ్.. మౌనికా రెడ్డి!! (Video)

70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా పోతుంది : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments