Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-03-2024 గురువారం దినఫలాలు - ఉద్యోగయత్నంలో స్త్రీలకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

Advertiesment
astro8

రామన్

, గురువారం, 7 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ బ|| ద్వాదశి రా.10.17 ఉత్తరాషాఢ ఉ.9.50 ప.వ.1.37 ల 3.08.
ఉ.దు. 10. 13 ల 11.00 ప.దు. 2.55 ల 3.42.
 
మేషం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
వృషభం :- ఉద్యోగయత్నంలో స్త్రీలకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు గడ్డుకాలం. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
మిథునం :- ఆత్మీయుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం ఉత్తమం. కొన్ని సందర్బాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరకపటుత్వం నెలకొంటాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో గడుపుతారు. ఖర్చులు అధికమవుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
సింహం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.
 
కన్య :- ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. మీ శ్రీమతి హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి.
 
తుల :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ధనమూలకంగా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. 
 
ధనస్సు :- అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. బంధువులను కలుసుకుంటారు. రాబోయే ఖర్చులకు ఆదాయం సర్దుబాటు చేసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామిక వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత బలహీనతలు గోప్యంగా ఉంచాలి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పెంపుడు జంతువులపట్ల జాగ్రత్త అవసరం. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు.
 
కుంభం :- స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. మీ అలవాట్లు, బలహీనతల వల్ల ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వ్యాపార, పరిశ్రమ రంగాల వారికి చికాకులు అధికం. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం.
 
మీనం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. స్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు ఎదురవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీ కుబేర పూజ ఎప్పుడు చేయాలి.. ఉసిరిని దానం చేస్తే?