Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-07- 2025 బుధవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

రామన్
బుధవారం, 9 జులై 2025 (05:03 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు అధికం. ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. గృహమార్పు అనివార్యం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ శ్రమ ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ప్రయాణం తలపెడతారు.
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య దాపరికం తగదు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సకాలంలో పనులు పూర్తిచేస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు విపరీతం. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పత్రాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం వివాదాస్పదమవుతుంది.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సన్నిహితులను కలుసుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ జోక్యం అనివార్యం. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మాటతీరుతో ఆకట్టుకుంటారు. కార్యం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాలు అందుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలో మీదే పైచేయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది.
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఓర్పుతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. అప్రమత్తంగా ఉండాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. శ్రమించినా ఫలితం ఉండదు. చీటికిమాటికి చికాకుపడతారు. పెద్దల సలహా పాటించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. సంతానం చదువులపై దృష్టిపెట్టండి. గృహనిర్మాణ ప్లాన్‌కు ఆమోదం లభిస్తుంది. ప్రయాణం కలిసివస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments