Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-08-2023 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభలు, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి.
 
వృషభం :- విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
 
మిథునం :- మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు, ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల, తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆథ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూల మవుతాయి. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. సమయస్ఫూర్తితో ఒక సమస్యను అధిగమిస్తారు. స్థోమతకు మించిన వాగ్దానాలవల్ల ఇబ్బందు లెదుర్కుంటారు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
కన్య :- ఫైనాన్సు, వ్యాపారులు మొండి బాకీల మీద దృష్టి ఉంచండి. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
తుల :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్ని నచ్చని సంఘటన లెదురైనా భరించక తప్పదు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించినవే కావటంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానేసిద్ధం చేసుకుంటారు.
 
వృశ్చికం :- వాణిజ్య ఒప్పందాలు, బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో ఏకాగ్రత అవసరం. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్లీడర్లకుతమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు సమస్యలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీల పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
మకరం :- కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. ఆరోగ్యంలో ఆకస్మిక ఆందోళన తప్పదు.
 
కుంభం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు.
 
మీనం :- మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ విజయాలను ఎప్పటికీ చెరిగిపోవు.. కేటీఆర్

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

అన్నీ చూడండి

లేటెస్ట్

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

14-09-2024 శనివారం దినఫలితాలు : అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు....

తర్వాతి కథనం
Show comments