Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-09-2022 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంతవరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్స్ రంగాల వారికి పని భారం అధికమవుతుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయంలోను ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం.
 
మిథునం :- మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కర్కాటకం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు వాయిదాల పద్దతిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
సింహం :- వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇబ్బందులు తప్పవు. వ్యాపారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రముఖులకు శుభాక్షాంక్షలు అందిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కన్య :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- హోటల్, కేటరింగ్ రంగాల వారికి పని భారం, పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
వృశ్చికం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖులతో కలిసి విందు, వినోదాలు, వేడుకలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి.
 
ధనస్సు : - ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆదర్శభావాలు కల వ్యక్తులు పరిచయం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి.
 
మకరం :- వృత్తి, ఉద్యోగ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చు కోవాలనే మీకోరిక నెరవేరుతుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం :- మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి వారి ఆదరణ పొందుతారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలుతప్పవు. 
 
మీనం :- బంధువులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments