Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-05-2023 ఆదివారం రాశిఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన మీ సంకల్పం....

Webdunia
ఆదివారం, 7 మే 2023 (04:00 IST)
మేషం :- ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
వృషభం :- ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. పాత రుణాలు తీర్చి తాకట్టువస్తువులను విడిపిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. హోటల్, స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. రవాణా రంగాల వారికి మెళుకువ అవసరం. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయంచేస్తారు.
 
మిథునం :- ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోతాయి. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. కొంతమంది మీ సాన్నిత్యాన్ని కోరుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
సింహం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. విలాసాలకు, ఆడంబరాలకు బాగావ్యయం చేస్తారు. పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతంకూడదు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలించదు.
 
కన్య :- దైవ, సేవా కార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా, చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వార్తా సంస్థలలోని వారికి మందకొడిగా ఉంటుంది. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్కాలం. బంధు మిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
వృశ్చికం :- దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఎలక్ట్రానిక్, ఎ.సి. రంగాల్లో వారికి కలిసి రాగలదు. ప్రముఖులతో సాన్నిత్యం పెంచుకుంటారు. స్త్రీలు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల ఆకస్మిక రాక వల్ల మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
మకరం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. స్త్రీలు షాపింగులకు ధనం బాగా ఖర్చుచేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. మిత్రుల సహకారం వల్ల టి.వి., రేడియో రంగాలవారికి అనుకూలం.
 
కుంభం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు.
 
మీనం :- స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. పారిశ్రామిక రంగాల వారికి లైసెన్సులు, పర్మిట్లు సానుకూలమవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలించవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments