Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-07-2022 బుధవారం రాశిఫలాలు ... మహావిష్ణువును ఆరాధించిన...

Webdunia
బుధవారం, 6 జులై 2022 (04:00 IST)
మేషం :- తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. నూతన కార్యక్రమాలు వాయిదా పడుట మంచిదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైన అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దూరప్రయాణాలలో అపరిచితులపట్ల మెళకువ అవసరం.
 
వృషభం :- వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు వస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు.
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతిష్టలకు కొంత విఘాతం కలిగే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పు రైతులకు ఊరటనిస్తుంది. బంధుమిత్రుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. మీ సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. శెనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి.
 
సింహం :- గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశంఉంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం వస్తువులను చేజార్చుకుంటారు. ఇంటికోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ అంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమాటం ఎదురయ్యే అవకాశం ఉంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్సు, చిట్స్ రంగాల్లో వారికి ఓర్పు చాలా అవసరం. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
తుల :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఆర్థాంతంగా ముగుస్తాయి. సమావేశాలలో పూర్వ మిత్రులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళుకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. కొత్త పరిచయాల వల్ల లబ్ది పొందుతారు. రాజకీయానాయకులుసభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- ఉద్యోగ, వ్యాపార విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. గృహనిర్మాణాలు సకాలంలో పూర్తికావు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి అధికమవుతుంది. పాత రుణాలు చెల్లిస్తారు. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. స్త్రీలకు సంభాసించునపుడు మెళుకువ అవసరం.
 
కుంభం :- ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాలలో వారికి జయం చేకూరును. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమ, సమర్థతలకు తగిన ప్రతిభ మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలు కాగలవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments