Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-06-2022 ఆదివారం రాశిఫలాలు ... దక్షిణామూర్తి పారాయణం చేసినా సర్వదా శుభం...

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (04:00 IST)
మేషం :- కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.
 
వృషభం :- అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. మీ వాహనం ఇతరుల కిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల యత్నాలకు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
మిథునం :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. శత్రువుల కూడా మిత్రులుగా మారతారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఖర్చులు, ఇతర అవసరాలు మెండుగా ఉంటాయి.
 
కర్కాటకం :- కొత్త కొత్త వ్యాపార రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు, కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలు షాపింగ్ లోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
కన్య :- మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. రాజకీయాలలో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో తిప్పి గొట్టగలుగుతారు. శ్రీమతి శ్రీవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
 
తుల :- ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. ఇంటి రుణములు కొన్ని తీరుస్తారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
వృశ్చికం :- వ్యాసాగాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. సిమెంటు, కలప, జగన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీ కళత్ర సేవలు, ప్రేమాభిమానాలు సంతోషపరుస్తాయి. తల పెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు, ప్రణాళికలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
మకరం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. ఎ.సి. కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. పాత రుణాలు తీరుస్తారు. అనుకోని అతిథుల ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
 
కుంభం :- కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ యత్నాలకు ఆత్మీయులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు విదేశీ చదువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు.
 
మీనం :- శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించండి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

లేటెస్ట్

11-02-2025 మంగళవారం రాశిఫలాలు - త్వరలోనే రుణవిముక్తులవుతారు...

Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?

ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. భక్తుల రద్దీ

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

10-02-2025 సోమవారం రాశిఫలాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments