Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

సెల్వి
శనివారం, 5 ఏప్రియల్ 2025 (09:04 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆటుపోట్లకు స్పందిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ రాజీపడొద్దు. మీకు రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. చేస్తున్న పనులు నిలిపివేయొద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బెట్టింగులకు పాల్పడొద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణవిముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తపరిచయాలు ఏర్పతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోండి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments