Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

Advertiesment
Astrology

రామన్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అనవసర విషయంలో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. వేడుకకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీ కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకవద్దు. పత్రాల రెన్యువల్‌లో నిర్లక్ష్యం చేయకండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యం సిద్ధిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోనుకావద్దు. ధనసమస్యలు ఎదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. భేషజాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణవిముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?