Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-03-2023 తేదీ ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం...

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (05:05 IST)
మేషం :- రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన ఒత్తిడి, చికాకులు అధిమవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. సన్నిహితులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి.
 
మిథునం :- షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. మత్స్య కోళ్ళవ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. 
 
కర్కాటకం :- ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.
 
సింహం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కన్య :- బంధుమిత్రులతో కలసి విందు, వినోదాలు పాల్గొంటారు. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. విద్యుత్, ఏ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పనిభారం అధికం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీపై శకునాలు, పట్టింపులు తీవ్రప్రభావం చూపుతాయి. 
 
తుల :- ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. గృహోకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. రవాణా రంగాలలోని వారికి చికులు అధికమవుతాయి. చేతివృత్తుల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- రాజకీయ రంగాల్లోవారికి అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాలలో నూతన వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల సమస్యలు తప్పవు. వ్యాపారాలలో ఆటంకాలు అధికంగమించి అనుభవం గడిస్తారు. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి.
 
ధనస్సు :- వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబీకుల కోసం విరివిగా ధనం వ్యయం చేస్తారు.
 
మకరం :- కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందిపలుకుతాయి. బంధువుల రాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి ఆందోళనలు అధికమవుతాయి. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కుంటారు. 
 
కుంభం :- రావలసిన ధనంవాయిదా పడుతుంది. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అనవరం. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటింటం శ్రేయస్కరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. అనువు కాని చోట ఆధిపత్యం చెలాయించటం మంచిది కాదు. సోదరీ, సోదరులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. నూతన ప్రదేశ సందర్శనలు, పుణ్యక్షేత్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

తర్వాతి కథనం
Show comments