Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-09-2022 ఆదివారం దినఫలాలు_ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (05:00 IST)
ఇష్టదైవాన్ని ఆరాధించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం:- ఉపాధ్యాయులతో మితంగా సంభాషించండి. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. రుణవాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు అనురాగ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యంగా ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి.
 
వృషభం :- ఉద్యోగస్తులకు స్థానచలన యత్నాల్లో పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలకువస్తువుల పట్ల, దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, రాణింపు, ప్రశంసలులభిస్తాయి. అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. 
 
మిథునం:- కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూలు పానీయ, కూరగాయల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బంధువులు మధ్య సయోధ్య నెలకొంటుంది. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందటంతో పాటు తోటి విద్యార్థులతో పోటీ పడతారు.
 
కర్కాటకం:- అనుకోని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టటానికి యత్నిస్తారు. కోర్టు వ్యవహరాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
సింహం:- రిప్రజెంటేటిట్లు టార్గెట్లు అధికమిస్తారు. కష్ట సమయంలో ఆత్మీయులకు అండగా నిలుస్తారు. కొంతమంది మీ ఛతురోక్తులకు తీవ్రంగా స్పందించే ఆస్కారం ఉంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
జాయింట్ వ్యాపారస్తులకు పరస్పర అవగాహన లోపంవల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
కన్య:- హామీలకు సంబంధించిన విషయాల్లో మెలకువ వహించండి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. విందులు, వినోదాల్లో పలువురిని ఆకట్టుకుంటారు. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్ధాలకు గురికావలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకువస్తాయి.
 
తుల: - ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. అయిన వారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. రహస్యాన్ని దాచలేని మీ బలహీనత ఇబ్బంది కలిగిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 
 
వృశ్చికం:- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. కళ, క్రీడ సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. క్రయ విక్రయాలు సామాన్యం.
 
ధనస్సు:- వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువు చేజార్చుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు, చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దుబారా ఖర్చులు అధికం. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి.
 
మకరం:- ప్రైవేటు సంస్థలలోని వారికి అంకితభావం ఎంతో ముఖ్యం. వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీ శ్రీమతితో విభేధించడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ధనసహాయం, ఖర్చుల విషయాల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కుంభం:- ధనం, వస్తువులపై అధిక ఆపేక్ష వల్ల బంధు మిత్రులకు దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సౌఖ్యం, సోదరుల నుండి ఆదరణ పొందుతారు.
 
మీనం:- దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం సంభవం. భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరగటంతో ఒడిదుడుకులు తప్పవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Video)

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments