Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

రామన్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త పనులు చేపడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. భేషజాలకు పోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తులు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గుట్టుగా మెలగండి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నోటీసులు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. పరిచయస్తులతో సంభాషిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంకల్పబలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అపోహలకు తావివ్వవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సామరస్యంగా మెలగండి. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. దుబారా ఖర్చులు విపరీతం. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandra Babu: రాయలసీమను హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. టీడీపీ

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

అన్నీ చూడండి

లేటెస్ట్

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

తర్వాతి కథనం
Show comments