Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేదీ 04-02-2023 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (04:04 IST)
మేషం :- అనుకున్న పనుల్లో స్పల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు వంటివి తప్పవు. విద్యార్థులు విద్యా విషయాలపై ఏకాగ్రత వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
వృషభం :- బంధువుల రాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అధికమైన చికాకులను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు అన్నివిధాలా కలిసిరాగలదు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. దూర ప్రయాణాలలో అపరిచితవ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అనుకూలం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కర్కాటకం :- మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలను పొందుతారు.
 
కన్య :- ప్రైవేటు, పత్రికా సంస్థలలోని ఉద్యోగస్తులకు యాజమాన్యంతో ఆవగాహన లోపిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే కోరిక నెరవేరగలదు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
తుల :- ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికినూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముందుగా ఊహించిన ఖర్చులు కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
వృశ్చికం :- రావలసిన బాకీలు వసూలు కాకపోవటంతో ఆందోళన చెందుతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వస్త్ర, కళంకారి, బంగారు, వెండి, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృది. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
ధనస్సు :- మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులకు అనుకూలం. చేతి వృత్తి వ్యాపారులకు పని భారం అధికమవుతుంది. సోదరి, సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మకరం :- రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారులు చేత మాటపడాల్సి వస్తుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
కుంభం :- వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకుమంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం :- దానధర్మాలు చేయడంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments