Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-06-202 సోమవారం దినఫలాలు - వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు...

రామన్
సోమవారం, 3 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| ద్వాదశి రా.11.13 అశ్వని రా.11.26 రా.వ.7.34 ల 9.03. ప.దు.12.23 ల 1.15, పు.దు. 2. 59ల 3.51.
 
మేషం :- ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, అదనపు బాధ్యతలు స్వీకరించ వలసివస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. గృహ మార్పుతో ఇబ్బందులుతొలగి మానసికంగా కుదుటపడతారు.
 
వృషభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సినిమా, విధ్య, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు అధికం కావడం వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. పోస్టల్, ఎల్.ఐ.సి., ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
మిథునం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మిత్రులపై మీరు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కర్కాటకం :- దైవ సేవా కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అర్థాంతంగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. మీ అవసరాలకు తాకట్టు పెడతారు. బంధువుల తాకిడి పెరుగుతుంది. మీ పనులు, వ్యవహారాలు మీరే స్వయంగా నిర్వహించుకోవటం మంచిది.
 
సింహం :- వృత్తిపరంగా ఎదురైన సమస్య తొలగిపోతాయి. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. కోర్టు వ్యవహరాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నూతన వ్యక్తుల విషయంలో అప్రమత్యంగా వ్యవహరించండి.
 
కన్య :- ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు మందకొడిగా వుంటుంది. ఏదైనా ఆకస్మికంగా అమ్మే అవకాశంఉంది.
 
తుల :- ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రావలసిన ధనం వసూలులో కొంతమేరకు చేతికందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు.
 
వృశ్చికం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అధిక పనిభారం వల్ల చికాకులను ఎదుర్కుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి.
 
ధనస్సు :- సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం శ్రేయస్కరం. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
 
మకరం :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధువర్గాల నుండి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు.
 
కుంభం :- తలపెట్టిన పనుల్లో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. మీ రాక బంధువులకు ఆనందానిస్తుంది. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్ లోపం, కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ప్రయాణాలు, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
 
మీనం :- భాగస్వామిక సమావేశాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టటం మంచిది కాదని గ్రహించండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు, మొండితనం చికాకు కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

తర్వాతి కథనం
Show comments