Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31-05-2024 శుక్రవారం దినఫలాలు - ఎంతో కొంత పొదుపు చేయడం మంచిది...

Advertiesment
Astrology

ఠాగూర్

, శుక్రవారం, 31 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| అష్టమి ఉ.8.46 శతభిషం ఉ.5.48 పూర్వాభాద్ర తె.4.10 ఉ.వ.11.45 ల 1.15. ఉ.దు. 8.08 ల 8.59 ప. దు. 12.21 ల 1.11.
 
మేషం :- వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలను అధికమిస్తారు. సామాజిక, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, పట్టింపులు చోటు చేసుకుంటాయి. ఎంతో కొంత పొదుపు చేయడం మంచిది. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు.
 
వృషభం :- బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సందేహాలు వీడి నమ్మకంతో యత్నాలు సాగించండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. 
 
మిథునం :- దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కర్కాటకం :- కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రావలసిన ధనం వాయిదా పడుతుంది.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పైఅధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేతి వృత్తి వ్యాపారులకు పని భారం అధికమవుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులసహాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి.
 
కన్య :- ఆర్థిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
 
తుల :- దంపతుల మధ్య కలహాలు తలెత్తినా తాత్కాలికమేనని గమనించండి. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ, సహకారాలు అందిస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రులకోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
ధనస్సు :- మీ సంతానం మొండివైఖరి వల్ల అసహనానికి గురవుతారు. స్నేహితులు మీ జీవితాన్నికి మూల స్థంభాలుగా మారతారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
మకరం :- మీ పనులు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది.
 
కుంభం :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి తమ పనుల్లో ఏకాగ్రత అవసరం. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, చల్లని పానీయాలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మీనం :- వృత్తుల, ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-05-202 గురువారం దినఫలాలు - స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు...