Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-05-2024 సోమవారం దినఫలాలు - విద్యార్థులకు శుభవార్తా శ్రవణం...

Astrology

రామన్

, సోమవారం, 27 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ బ|| చవితి సా. 4.42 పూర్వాషాఢ ఉ.10.25 సా.వ.6.11 ల 7.44 ప.దు. 12.21 ల 1.12, పు. దు. 2. 54 ల 3.44.
 
మేషం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.
 
వృషభం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు.
 
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం :- చేతిలో ధనం నిలవడం కష్టమవుతుంది. స్త్రీలకు అయిన వారితో పట్టింపులెదురవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహ పరుస్తాయి. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. వాహనం నడుపుతున్నపుడు మెళకువు ఏకాగ్రత వహించండి.
 
సింహం :- ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. సిమెంట్, కలప వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందిపడతారు. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికులతో చికాకులు తలెత్తుతాయి.
 
కన్య :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనకరంగా ఉండదు.
 
తుల :- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి సమకూర్చుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు.
 
వృశ్చికం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదావకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
మకరం :- చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో అవగాహన లోపిస్తుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు.
 
కుంభం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలను అధికమిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి.
 
మీనం :- స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. విద్యార్థులు పరీక్షల గురించి ఆందోళన చెందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-05-2024 ఆదివారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...