శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| పాఢ్యమి సా.6.52 అనూరాధ ఉ.9.58 ప.వ.3.43 ల 5.21. ఉ.దు. 8.08 ల 8. 59 ప. దు. 12. 21 ల 1.11.
మేషం :- ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
వృషభం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. విలాసాల కోసం ధనం వ్యయం చేస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తం ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులు మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి.
మిథునం :- ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అతిథిమర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
కర్కాటకం :- బంధువులను కలుసుకుంటారు. అథ్యాత్మిక, సేవా విషయాలపై దృష్టి సారిస్తారు. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధచూపిస్తారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. చిరు వ్యాపారులకు, చిన్నతరహా వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలువింటారు.
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. భాగస్వామిక చర్చలు వాయిదాపడుట మంచిదని గమనించండి. కోర్టు, ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. శ్రమాధికత, మానసిక ఆందోళనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాదిపథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
తుల :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. మీ కళత్ర వైఖరిమీకు చికాకు కలిగించగలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసివస్తుంది.
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలలో ఆశించినంత పురోగతి ఉండదు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు.
ధనస్సు :- ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తుసామగ్రి సమకూర్చుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తుంది. ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడ మంచిదికాదు.
కుంభం :- బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి.
మీనం :- ఉద్యోగం చేయువారు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రుణ విముక్తులవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. వృత్తులవారికి గుర్తింపుతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.