Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

రామన్
శుక్రవారం, 2 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీదైన రంగంలో పురోగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. సన్నిహితుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అదృష్టయోగం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. చిన్నవిషయానికే చికాకుపడతారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కార్యసాధనకు పట్టుదల ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం అవసరాలకు ధనం అందుతుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కీలకపత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారం అనుకూలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలిసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. సంకల్పబలమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వాహనయోగం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

తర్వాతి కథనం
Show comments