Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-03-2024 శనివారం దినఫలాలు - వృత్తుల వారికి మిశ్రమ ఫలితం...

రామన్
శనివారం, 2 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ ఐ|| సప్తమి తె.3.34 విశాఖ ఉ.10.32 ప.వ.2.39 ల 4.19.
ఉ.దు.6.21 ల 7.55.
 
మేషం :- ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. చిట్స్, ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్థులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వ్యవసాయ, తోటలు రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. ఆపత్సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
 
వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. గత స్మృతులు జ్ఞప్తికి రాగలవు. క్రయ, విక్రయ రంగాల వారికి పురోభివృద్ధి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది.
 
మిథునం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలోసందడి కానవస్తుంది. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, కీలకమైన చర్చలు సానుకూలమవుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అధికం కావటంతో ఒకింత ఒడిదుడుకులకు లోనవుతారు. రాజకీయాలలో వారికి గుర్తింపుతో పాటు చికాకులు తప్పవు. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
సింహం :- బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. ఉద్యోగస్థులు అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగి వున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. మీ పెద్దల వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. తొందరపడి వాగ్ధానాలు - చేసి సమస్యలు తెచ్చుకోకండి.
 
తుల :- కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు ముఖ్యం. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్ధినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి.
 
వృశ్చికం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
ధనస్సు :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంగారు, వెండి, రంగాలో వారికి పురోభివృద్ధి. గృహంలో మార్పులు చేయుప్రయత్నాలు అనుకూలించగలవు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
మకరం :- టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి పొందుతారు. నిరుద్యోగులకు త్వరలోనే సంతృప్తికరమైన అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక కార్మికులకు పరస్పర అవగానాదైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కుంభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాలలో వారికి మిశ్రమఫలితం.
 
మీనం :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజంట్లుకు మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఇతరుల కారణంగా మీ పనులు వాయిదా పడతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. చంద్రబాబు

పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11-2024 శనివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

హనుమంతుడి వడమాలకు.. రాహువుకు, శనికి ఏంటి సంబంధం?.. జిలేబి?

15-11-2024 శుక్రవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు...

వాస్తు దోషాలు, గ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే..?

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

తర్వాతి కథనం
Show comments