Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-02-2024 బుధవారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం...

Advertiesment
Astrology

రామన్

, బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ చవితి రా.1.05 చిత్త పూర్తి ప.వ.2.04 ల 3.49. 3.5.11.52 e 12.37.
శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నూతన వ్యాపారాల్లో ఒడిదుడుకులెదురైనా అధికమిస్తారు. పాత బిల్లులు చెల్లిస్తారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కుటుంబ సమస్యలు, బంధుమిత్రులతో పట్టింపులు తొలగుతాయి. 
 
వృషభం :- స్థిర చరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలుమాని ఏకాగ్రతతో పనిచేయటం శ్రేయస్కరం.
 
మిథునం :- స్త్రీలు కళ్ళు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
కర్కాటకం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అసవరం. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడంమంచిది.
 
సింహం :- టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. నిర్మణ కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది.
 
కన్య :- స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించటం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బ్యాంకు పనులు త్వరితగతిన పూర్తికాగలవు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
తుల :- పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. విద్యార్థులకు ఒత్తిడి, అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళకువ చాలా అవసరం.
 
వృశ్చికం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్ధినులకు ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. ఇతరుల వాహనం నడపటం వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. షేర్ మార్కెట్ రంగాల వారికి మెళకువ అవసరం.
 
ధనస్సు :- ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించ లేకపోతారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతిని దూరం చేస్తారు. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పతాయి. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పెద్దలను నుంచి అవమానాలు తప్పవు. రుణం తీర్చటానికై చేయు యత్నం వాయిదా పడుతుంది.
 
మకరం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. రుణాల కోసం అనేషిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావలసి ఉంటుంది. ఎంతటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కొంటారు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. ప్రయాణాలను ఆకస్మికంగా వాయిదావేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఏ విషయంలోనూ ఇతరులను అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఇక మంగళసూత్రాలను అమ్ముతారట.. అంతా భక్తుల కోసం..?