Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-02-2024 శుక్రవారం మీ రాశిఫలాలు - సూర్యస్తుతి ఆరాధించిన శుభం...

Advertiesment
Surya Deva

రామన్

, ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ పాఢ్యమి రా.7.15 పుబ్బ రా.12.19 ఉ.వ. 6.36 ల 8.23.
సా.దు. 4.22 ల 5.07.
సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. గతంలో వాయిదావేసిన పనులు పునఃప్రారంభిస్తారు. తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
వృషభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో శ్రమించినగాని అనుకున్నది సాధ్యంకాదు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగావుంటాయి. బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. గృహ మరమ్మతులు, నిర్మాణాలు వాయిదా పడతాయి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం :- స్థిరచరాస్తుల వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి.
 
సింహం :- కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. ఎంతో శ్రమించిన మీదటగాని అనుకున్నపనులు పూర్తికావు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య :- ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు.
 
తుల :- రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. శతృవులపై విజయం సాధిస్తారు. మీ చిన్నారుల కోసం ధనంవిరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది.
 
ధనస్సు :- విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. స్వయంకృషితోనే మీ పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. షాపులలో పనిచేసే వారిలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్ధినులకు ప్రేమ వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు.
 
కుంభం :- విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దలసలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ధనం చేతిలో నిలబడటం కష్టమే. స్త్రీలకువిలాస వస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మీనం :- విందుల్లో పరిమితి పాటించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-02- 2024 నుంచి 02-03-2024 వరకు మీ వార రాశి ఫలితాలు