Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

తిరుమలలో ఇక మంగళసూత్రాలను అమ్ముతారట.. అంతా భక్తుల కోసం..?

Advertiesment
Tirumala temple to sell Mangala Sutras

సెల్వి

, మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (19:20 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కాలిబాటన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. భక్తులు కాలిబాటన కొండపైకి వచ్చే తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. వన్య ప్రాణులతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వుండేందుకు గాళిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మొక్కులమెట్టు వంటి ప్రాంతాలలో నిరంతరం భక్తి భజన సంగీత కార్యక్రమం నిర్వహిస్తారని తితిదే అధికారులు తెలిపారు.  
 
శ్రీవారి ఆలయంలో ద్వార పాలకులైన జయ-విజయభేరి ద్వారాలకు రూ.1.69 కోట్ల ఖర్చులో బంగారు గడులు తయారు చేస్తారు. అలాగే నాలుగు కోట్లతో 4,5 లేదా 10 గ్రాములలో భక్తులకు మంగళసూత్రం తయారు చేసే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. 
 
ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి అలిపిరిలో గో ప్రదక్షణ మందిరం వద్ద శ్రీనివాస అనుగ్రహ యాగం నిర్వహించేందుకు రూ.4.12 కోట్ల ఖర్చుతో నిత్య యాగ శాల నిర్మించనున్నారు.  తిరుపతిలోని గోవింద రాజ స్వామి ఆలయంలో దేవి, భూదేవి, ఉత్సవ మూర్తులకు రూ.15 లక్షలతో బంగారు కవచం తయారు చేయబడుతుందని తితిదే వెల్లడించింది. తిరుమలలో హరే రామ హరే కృష్ణ రోడ్డులో రూ.7.5 కోట్ల ప్లే గ్రౌండ్ నిర్మించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-02-2024 మంగళవారం మీ రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...