Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

రామన్
మంగళవారం, 1 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. త్వరలో సమస్యలు సద్దుమణుగుతాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆకస్మిక ఖర్చులు పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ధనసమస్య ఎదురవుతుంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పురస్కారాలు, ప్రశంసలందుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక పదవులు చేపడతారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రోజువారీ ఖర్చులే ఉంటాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనుల్లో ఒత్తిడి అధికం. పాతపరిచయస్తులు తారసపడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సన్నిహితులకు సాయం అందిస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వేడుకలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. సేవ, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య సమాచారం సేకరిస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ముందుచూపుతో వ్యవహరిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఒక సమస్య నుంచి బయలపడతారు. కొత్త పనులు చేపడతారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఆప్తులు సాయం అందిస్తారు. అవసరం నెరవేరుతుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపస్తుంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. చేపట్టిన పనులు సాగవు. ఖర్చులు విపరీతం. శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహపరుస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

తర్వాతి కథనం
Show comments