Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-07-2023 శనివారం రాశిఫలాలు - విష్ణు సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Webdunia
శనివారం, 1 జులై 2023 (04:04 IST)
మేషం :- కాంట్రాక్టర్లు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రావలసిన బకాయిలు సకాలంలో అందుతుంది.
 
వృషభం :- లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటి వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితో మెలగటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ఖర్చులెదురైనా ఇబ్బందులు ఏమాత్రం ఉండవు.
 
మిథునం :- కళాకారులకు, సినిమా రంగాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా లాభిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ పట్టుదల కార్యరూపం దాల్చుతుంది. శారీరక ఆరోగ్యము నందు కొద్దిపాటి మార్పులు వచ్చే సూచనలున్నాయి. ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు అధికమవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. దుబారా నివారించలేరు.
 
సింహం :- ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉద్యోగంలో మానసిక అశాంతి, చికాకులు సంభవిస్తాయి. ప్రేమికుల అనుమానాలు మరింతగా బలపడతాయి. వాహనయోగం పొందుతారు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. విద్యాసంస్థలలో వసతి లభిస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు.
 
కన్య :- వృత్తి వ్యాపారస్తులకు అధిక శ్రమ ఉండును. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిర్మాణ పనులలో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లు కష్టనష్టాలు ఎదుర్కోవలసివస్తుంది.
 
తుల :- వృత్తి పనివారు ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం అందటంతో మానసికంగా కుదుటపడతారు.
 
వృశ్చికం :- వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. రాజకీయ నాయకులు కొంతసంక్షోభం ఎదుర్కొనక తప్పదు. గతంలో వాయిదా పడిన పనులు మరల ప్రయత్నించుట వల్ల ముందుకు సాగును. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్ర సహాయములతో మీ పనుల్లో పురోభివృద్ధి పొందుతారు. వ్యవసాయ దారులు పంటల్లో లాభాలు గడిస్తారు.
 
మకరం :- మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును.
 
కుంభం :- బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మీనం :- సాంఘిక, బంధుమిత్రాదులయందు అన్యోన్యత తగ్గును. ఆరోగ్య విషయంలో చికాకులు ఎదుర్కుంటారు.కీలకమైన వ్యవహరాల్లో మెలకువ వహించండి. సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments