Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-03-2021 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణుడుని పూజించినా...

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
వృషభం : మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. విజయాలు తేలికగా సొంతమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. 
 
మిథునం : కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలు, దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడుతుంది. స్థిరాస్తి అమ్మటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. 
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. సొంతంగాగానీ, భాగస్వామ్యంగా గానీ, చేసిన వ్యాపారాలు కలిసివచ్చును. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. ఉద్యోగులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తికానరాదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. దైవ, దర్శనాలు తేలికగా అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. మీ సంతానం వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 
 
వృశ్చికం : మత్స్యు కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాక వల్ల గృహంలో ఖర్చులు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం మంచిది కాదని గమనించండి. 
 
ధనస్సు : దైవ, పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీలకు ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవడం అన్ని విధాలా ఉత్తమం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మకరం : బంధు మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో సదావకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించక పోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. 
 
కుంభం : మిత్రులతో కలిసి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. కార్యసాధనలో బాగా శ్రమించాల్సి ఉంటుంది. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మీనం : చేతి వృత్తి, వ్యాపారులకు ఒర్పు, నేర్పు ఎంతో అవసరం. ఖర్చులు అంతగా లేకున్నా ధనం వ్యయం విషయంలో మెళకువ అవసరం. బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

తర్వాతి కథనం
Show comments