Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-01-2021 శనివారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని దర్శించినా...

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (04:21 IST)
మేషం : పత్రికా సంస్థల్లోని వారికి వ్యాపార ప్రకటనల ఏజెంట్లకు ఒత్తిడి పనిభారం అధికం. ఒక పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం ఉంది. మీ పథకాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. 
 
వృషభం : వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలెదుర్కొంటారు మీపై సెంటిమెంట్లు గత అనుభవాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. తొందరపడి హామీలిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. బంధువులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయడం మంచిదికాదు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. 
 
మిథునం :  విదేశాల్లోని అయిన వారి క్షేమ సమచారం అందటంతో మనస్సు కుదుపటడుతుంది. నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిదికాదు. 
 
కర్కాటకం : మిమ్మలను ఆందోళనకు గురిచేసిన సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్పూర్తికి గుర్తింపు, నగదు బహుమతి వంటి ప్రోత్సాహాకాలున్నాయి. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి అభిప్రాయంతో ఏకీభవించడం అన్ని విధాలా శ్రేయస్కరం. 
 
సింహం : ఇంటి అద్దెలు, బాకీలు వసూలులో సంయమనం పాటించండి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచిది. 
 
కన్య : వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాకయం. మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. చిన్నతరహా పరిశ్రమలు ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పురోభివృద్ధి. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు మొదలుపెడతారు. 
 
తుల : కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి అసహనం. చికాకులు అధికమవుతాయి. ప్రభుత్వం కార్యక్రమాలలో పనులు సానుకూలమవుతాయి. ఆస్తి పంపకాలు సమస్య అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారమవుతుంది. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. 
 
వృశ్చికం : కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. మీ సమర్థత, నిజాయితీలు ప్రముఖులను ఆకట్టుకుంటాయి. బంధువులు మీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. ధనంతో అన్ని సాధ్యమేనన్న మీ అపోహను తొలగించుకోండి. 
 
ధనస్సు : వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. 
 
మకరం : విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. నగదు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినవలసి వస్తుంది. స్త్రీలకు పనిభారం అధికం. 
 
కుంభం : పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో తగు జాగ్రత్త. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగి ప్రేమానుబంధాలు పెంపొందుతాయి. గత తప్పిదాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించండి. 
 
మీనం : మీ మాటతీరు, పద్దతులను ఎదుటివారికి నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిఫార్సు చేస్తారు. ధనార్జనే ధ్యేయంగా భావించక కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. వైద్య రంగాలవారు అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తిచేస్తారు. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

తర్వాతి కథనం
Show comments