Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-01-2021 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఉమాపతిని ఆరాధించినట్లైతే..?

Advertiesment
18-01-2021 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఉమాపతిని ఆరాధించినట్లైతే..?
, సోమవారం, 18 జనవరి 2021 (05:00 IST)
ఉమాపతిని ఆరాధించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అధ్యాపకుల నుంచి ఒత్తిడి, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, ఆటో మొబైల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
వృషభం: మీ సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చేతివృత్తుల వారి ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది. కీలకమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తారు.
 
మిథునం: ప్రేమికులు పెద్దల ఆగ్రహావేశాలకు గురికావలసి వస్తుంది. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుగలుగుతారు.  
 
కర్కాటకం: అకాల భోజనం, ప్రశాంతత లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రిజిస్ట్రేషన్లకు అది అనువైన సమయం కాదు. ధనం ఏమాత్రం నిలబెట్టలేక పోయినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒకానొక విషయంలో మీ చిత్తశుద్ధిని ఎదుటివారు శంకించే అవకాశం వుంది. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా వుండటం మంచిది. మీ ప్రయత్నాలకు సన్నిహితులు చేయూతనిస్తారు.
 
కన్య: ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
తుల: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా వుంటుంది. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. బంధువులతో సఖ్యత, రాకపోకలు పునః ప్రారంభమవుతాయి. రాజీ ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యల పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం: మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లోని పనులు అనుకూలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. 
 
ధనస్సు: విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల మందలింపులు తప్పవు. అవివాహితులకు త్వరలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పెద్దల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వస్తుంది. 
 
కుంభం: బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ధనం చేతిలో నిలబడటం కష్టం కావచ్చు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం వుంది.
 
మీనం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం వుంది. దైవ కార్యక్రమాలకు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో నూతన భాగస్వాములను చేర్చుకునే విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-01-2021 నుంచి 23-01-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు