Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-01-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు- ఆదివారం సూర్య స్తుతి చేసినట్లైతే..?

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 17 జనవరి 2021 (05:00 IST)
సూర్య స్తుతి చేసినట్లైతే శుభం కలుగుతుంది.
 
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. దూర ప్రయాణాల్లో మీ సంతానం పట్ల శ్రద్ధ వహించండి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.
 
వృషభం: వ్యాపారాభివృద్ధికై చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. బంధువుల రాక కొంత అసౌక్యం కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. 
 
మిథునం: రాజకీయనాయకులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కొత్త అనుభూతికి లోనవుతారు.
 
కర్కాటకం: ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పనులు మీరే చూసుకోవడం మంచిది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, పానీయ చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి. 
 
సింహం: కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
కన్య: రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధువులు మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. గృహ నిర్మాణాలకు కావలసిన అనుమతులు, వనరుల కోసం తీవ్రంగా యత్నిస్తారు. మిత్రులతో కలిసి సభ, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
తుల: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ శ్రీమతి ఇచ్చిన సలహా  తేలికగా కొట్టివేయడం మంచిది కాదు. 
 
వృశ్చికం: ఇతరుల వాహనం నడపటం వల్ల అనుకోని సమస్యలు తలెత్తగలవు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ యత్నాలు పథకాలు గుట్టుగా సాగించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
ధనస్సు: ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం వుంది. నిరుద్యోగులు ఊహాగాలతో కాలం వ్యర్థం చేయకండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. 
 
మకరం: మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రాబడికి మించి ఖర్చులెదురైనా తట్టుకుంటారు. రాజకీయాల్లో వారికి అలజడి అధికమవుతుందని గమనించండి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. 
 
కుంభం: ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విదేశాలు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
మీనం: రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు, అవమానాలు తలెత్తుతాయి. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చుతారు. పత్రికా రంగంలోని వారికి చిన్న చిన్న తప్పిదాలు జరిగే సూచనలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టిన రోజును మీరు ఎలా జరుపుకుంటున్నారు..?