Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-01-2121 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడుని పూజించినా...

Advertiesment
14-01-2121 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడుని పూజించినా...
, గురువారం, 14 జనవరి 2021 (05:00 IST)
మేషం : నూతన వస్త్ర వ్యాపారులకు లాభదాయకం. కుటుంబీకుల కోసం ఎంత ధనం వ్యయం చేసినా వారికి సంతృప్తి ఉండదు. గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 
 
వృషభం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాల్లో కొనుగోలుదార్లు, పనివారలను ఓ కంట కనిపెట్టుకోవడం ఉత్తమం. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కావడంతో పనులు పునఃప్రారంభమవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
మిథునం : స్త్రీలకు కళాత్మక పోటీల్లో నిరుత్సాహం తప్పదు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృద్ధాప్యంలో ఉన్నవారికి శారీరక బాధలు సంభవిస్తాయి. ప్రయాణాలు ఆకస్మికంగా ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఆడిట్స్, అకౌంట్స్ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు తప్పవు. ఇతరులు మీ పట్ల ఆకర్షితలువుతారు. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. మీ శ్రీమతి అవసరాలు, కోరికలు తీరుస్తారు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడయంకూడదు. 
 
సింహం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య : వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అందరితో కలుపుగోలుగా మెలిగి మన్నలు పొందుతారు. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానాలు, కానుకలు అందుకుంటారు. ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్ధంగా ఉంటాయి. వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. 
 
తుల : రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు, అవమానాలు తలెత్తుతాయి. ఇతరులపై ఆధారపడక స్వశక్తితోనే మీ పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాకయం. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలుపెడతారు. దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరుకాగలవు. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. ఇంటిలో హడావుడి పెరగడంతో మీలో నిస్తేజం చోటుచేసుకుంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
ధనస్సు : మిత్రుల ద్వారా ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. రుణం తీసుకోవడం, ఇవ్వడం క్షేమం కాదని గమనించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్సాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగస్తులకు ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. ఏ ప్రయత్నం కలిసిరాక పోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. 
 
మకరం : ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చేతిలో ధనం మితంగా ఉండటంతో ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి రాగలదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. 
 
కుంభం : వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రముఖుల కలయికసాధ్యంకాదు. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరుకాగలవు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. 
 
మీనం : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. మీ స్థోమతకు మించిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. ప్రయాణాల్లో చికాకులు ఎదుర్కొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

bhogi 2021 భోగి నాడు చిన్నారులకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు?