Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-10-2020 గురువారం రాశిఫలాలు - దుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించినా...

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాబడికి మంచిన ఖర్చులు వల్ల ఒకింత ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవడం క్షేమదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : ప్రైవేటు, పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చటానికి మరికొంత కాలం వేచివుండక తప్పదు. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
మిథునం : విద్యార్థినులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తుల ప్రతిభ, పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్యం కంటే సొంత వ్యాపారాల్లోనే రాణిస్తారు. బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కర్కాటకం : మీ లక్ష్య సిద్ధికి నిరంతర కృషి పట్టుదల అవసరమని గమనించండి. ఆధ్యాత్మిక చింతన వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకూలమైన కాలం. 
 
సింహం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. స్త్రీలతో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కొంతమంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. 
 
కన్య : ఏజెంట్లకు, బ్రోకర్లకు చికాకులు, నిరుత్సాహం అధికమవుతాయి. సన్నిహితుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. స్త్రీలు దైవ, శుభకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రచయితలకు, కళ, క్రీడకారులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల : దైవ, సేవ, పుణ్యకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి అవకాశం ఉంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, ఒత్తిడి తప్పవు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలలో ప్రోత్సాహం కానవస్తుంది. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కలహాలు, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రతలోపం వల్ల మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదావేయడం మంచిది. స్త్రీలు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
 
ధనస్సు : స్త్రీలకు నడుము, నరాలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. కుటుంబంలో చిన్నచిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులు, మితిమీరిన ధనవ్యయంతో ఆందోళన చెందుతారు. 
 
మకరం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు అధికారులకు మధ్య సమన్వయం లోపిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. 
 
కుంభం : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలపై శకునాలు, ఎదుటివారి మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తప్పిదమైనా సునిశితంగా ఆలోచించడం క్షేమదాయకం. 
 
మీనం : నిత్యావసర సరకుల స్టాకిస్టులకు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ సంతానం మొండితనంతో అసహానికి గురవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments