Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-10-2020 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీనరసింహ స్త్రోత్రం పఠనం చేస్తే..

20-10-2020 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీనరసింహ స్త్రోత్రం పఠనం చేస్తే..
, మంగళవారం, 20 అక్టోబరు 2020 (08:45 IST)
మేషం : పత్రిక, ప్రైవేటు రగంలోని వారికి చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
వృషభం : విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదపడతాయి. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. 
 
మిథునం : ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇంతకాలం పడినశ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. 
 
కర్కాటకం : మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పని చేయవలసి ఉంటుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్తులకు శుభదాయకం. 
 
సింహం : రావలసిన బకాయిలు సకాలంలో అందుటవల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఫ్లీడరు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి అవసరం. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
కన్య : కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాల సందర్శనాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
తుల : తల ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ముందు చూపుతో వ్యహరించండి. వాహన సౌఖ్యం పొందుతారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
వృశ్చికం : ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మార్పులు సంభవిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పాత వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మకరం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. భాగస్వామిక వ్యాపారాల్లో కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దుబారా ఖర్చులు అధికం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశా ఉంటాయి. వాహనం కొనుగోలు చేయు ప్రయత్నాలలో జయం చేకూరును. 
 
కుంభం : నిరుద్యోగ యత్నాలకు మంచి సలహా, సహకారం లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మీనం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పెద్దలతో పరస్పర ఏకీభావం కుదురుతుంది. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ఊహించని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రుల్లో నాలుగో రోజు.. కూష్మాండ అవతారంలో అమ్మవారు(వీడియో)