Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-08-2020.. ఆదివారం మీ రాశి ఫలితాలు.. హయగ్రీవ కవచం పఠిస్తే?

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం వుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రుణాలు తీర్చి తాకట్టు విడిపించుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరంటే కిట్టని వారు మీకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తారు.
 
వృషభం: మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నైమందని గమనించండి. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమల్లో వారికి ఆందోళన అధికం. ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో మాటపడాల్సి రావచ్చు. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లుగానే వుంటాయి.
 
మిథునం: ప్రైవేట్, పత్రిక సంస్థల్లోని వారికి రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాభివృద్ధి. విస్తరణల కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు.
 
కర్కాటకం: ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు అధికం. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం: రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు వుంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
కన్య: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలసిరాగలదు. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచడం క్షేమదాయకం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడులు, చికాకులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు తప్పవు.
 
తుల: రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది మెళకువ వహించండి. తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. భార్యభర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పాతమిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయాల్సి వుంటుంది. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా లాభదాయకంగా వుంటుంది. ప్రయాణాల్లో చికాకులు అసౌకర్యానికి గురవుతారు. మీ వాక్చాతుర్యానికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం: ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. వైద్యులకు సమస్యలు, ప్లీడర్లకు ప్రోత్సాహం కానవస్తుంది. ఉపాధ్యాయులకు పరస్పర అవగాహన లోపం. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మెళకువ వహించండి. 
 
కుంభం: కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. రుణం తీర్చటానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు.
 
మీనం: స్తిరాస్థి విక్రయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగ విషయాల దృష్ట్యా తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

తర్వాతి కథనం
Show comments