Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-05-2021 బుధవారం దినఫలాలు - స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల...

Webdunia
బుధవారం, 5 మే 2021 (04:00 IST)
మేషం : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు.
 
వృషభం : కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. సేవా, పుణ్య కార్యాల్లో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
మిథునం : వ్యాపార రంగాల్లో వారికి తోటివారి వల్ల సమస్యలు తలెత్తుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. స్త్రీలు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పుతో ఎంతో అవసరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశానికి ప్యరాణం చేయవలసి వస్తుంది. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది.
 
సింహం : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు తలెత్తుతాయి.
 
కన్య : సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో  సతమతమవుతారు.
 
తుల : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభిృవృద్ధి కానవస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆందోళన, చికాకులు తప్పవు.
 
వృశ్చికం : వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి తప్పదు. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. దూరపు బంధువుల రాక మిమ్మలను సందిగ్ధంలో పడేస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
ధనస్సు : చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. దంపతుల మధ్య సఖ్యతాలోపం, చీటికి మాటికి విసుక్కోవడాలు వంటివి చోటుచేసుకుంటాయి. బంధు మిత్రులరాకతో గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించకుంటాయి. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
మకరం : ప్రయత్నపూర్వకంగానే అనుకున్న పనులు పూర్తికాగలవు. కార్మికుల కృషికి తగిన ప్రతిఫలం కానరగాలదు. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట అధికమవుతాయి. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు.
 
కుంభం : వాతావరణంలో మార్పు వల్ల పెద్దలు స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఒకసారి చేజారిన అవకాశం మళ్లీ రాకపోవచ్చని గమనించండి. వాహనం వీలైనంత నిదానంగా నడపడం అతి ముఖ్యం. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక స్థితి ఏమాత్రం లోటువుండదని చెప్పవచ్చు. పత్రికా సంస్థలోని వారికి మార్పులు అనుకూలించవు.
 
మీనం : ఇంటా బయటా మీ మాటకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య  ఫలితాలనే ఇస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. స్థిరచరాస్తుల విషయలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు టీవీ చానెళ్లకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments